సత్యం, అహింసను ప్రపంచానికి చాటిన మహాత్ముడు గాంధీజీ

– మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్
సత్యం, అహింసలను ప్రపంచానికి చాటిన మహాత్ముడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అని మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, మంచిర్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పెంట రాజయ్యతో కలిసి జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో గల మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమంలో అహింస, సత్యాగ్రహం తో మహాత్మా గాంధీ ముఖ్యపాత్ర పోషించారని, బాపూజీగా, జాతిపితగా, మహాత్మగా నిలిచారని అన్నారు. సహాయ నిరాకరణ, స్వదేశీ వస్త్రధారణ లాంటి అహింస మార్గాలలో స్వాతంత్రం కోసం పోరాటం చేశారని అన్నారు. మహాత్మా గాంధీ అహింసా మార్గాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించి గాంధీ జయంతి రోజున ప్రపంచ అహింసా దినోత్సవంగా ప్రకటించడం గర్వంగా ఉందని అన్నారు. మహాత్మా గాంధీ సత్యం, అహింస మార్గాలను తాను స్వయంగా ఆచరించి ఆదర్శంగా నిలిచారని అన్నారు. మహాత్మా గాంధీ చెప్పిన శుభ్రత ప్రస్తుతం అందరూ పాటిస్తున్నామని, గ్రామాల అభివృద్ధే దేశాభివృద్ధి అని చెప్పిన బాపూజీ మాటలు ఆచరిస్తున్నామని అన్నారు. మహనీయులు చూపిన మార్గాలు ఆచరణ నీయమని, ప్రతి ఒక్కరు వారి ఆశయాలు పాటించాలని అన్నారు. అనంతరం అహింసా శాఖాహార ర్యాలీలో పాల్గొన్నారు. శాఖాహారం అమృతాహారం అని, మాంసాహారం వద్దని, శాఖాహారం తిని ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి జీవరాశి మనుగడకు సహకరించాలని, మాంసాహారం నిషేధించే పర్యావరణాన్ని కాపాడుకుందామని, మొక్కలు నాటి సంరక్షించుకుందామని అన్నారు. జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్ తో కలిసి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment