ఉద్యోగుల రక్షణకు ప్రాధాన్యం

102 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించడం అభినందనీయం
ఆర్.కె 7 గని మేనేజర్ సాయి ప్రసాద్
సింగరేణి సంస్థ ఉద్యోగుల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆర్.కె 7 గని మేనేజర్ సాయి ప్రసాద్ అన్నారు. మంగళవారం శ్రీరాంపూర్ ఏరియా లోని ఆర్.కె 7  గని ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో గని మేనేజర్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ సెప్టెంబర్ నెలలో ఆర్కే-7 గని 102 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించడం అభినందనీయమని, రాబోవు రోజుల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. పని స్థలాల్లో రక్షణతో కూడిన ఉత్పత్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గడిచిన 6 మాసాల్లో గనిలో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోలేదని, ప్రమాద రహిత గనిగా ఆర్కే-7 గని ముందుందని, రక్షణ సూత్రాలు పాటిస్తూ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను అభినందించారు. ప్రతి ఒక్క ఉద్యోగి సేఫ్టీ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం విధులు నిర్వహించాలని, భద్రతతో కూడిన ఉత్పత్తి సాధించే విధంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఉద్యోగుల రక్షణకే సింగరేణి సంస్థ మొదటి ప్రాధాన్యత ఇస్తుందని, రక్షణ పై అనేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, మన రక్షణ ఇంటి నుండే మొదలవుతుందని విధులకు హాజరయ్యే ప్రతి ఒక్క ఉద్యోగి తప్పనిసరిగా బైకులపై హెల్మెట్ ధరించి విధులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం సింగరేణి వ్యాప్తంగా ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 3.0 లో ఉద్యోగులు భాగస్వాములై గని లోని ప్రదేశాలు, కార్యాలయాలను శుభ్రంగా, సుందరీకరణగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో రక్షణ అధికారి రవిశంకర్, ఫిట్ ఇంజనీర్ ప్రవీణ్, అండర్ మేనేజర్లు రవీందర్, శ్రీనివాస్, రాజు, సంక్షేమ అధికారి సంతన్, టీబీజీకేఎస్ ఫిట్ సెక్రటరీ మెండె వెంకటి, ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ బీర రవీందర్, ఐఎన్టియుసి ఫిట్ సెక్రటరీ శ్రీకాంత్, సిఐటియు ఫిట్ సెక్రటరీ శ్రీధర్, బిఎంఎస్ ఫిట్ సెక్రటరీ మహేందర్, హెచ్ఎంఎస్ ఫిట్ సెక్రటరీ రాజేందర్,  సూపర్వైజర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment