ముందస్తు బతుకమ్మ సంబరాలు

తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సంబరాలు గురువారం మంచిర్యాల కోటపల్లి మండలం పారుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ వర్ణాల వర్ణ శోభితమైన తీరొక్క పూలతో ఆకర్షణీయంగా బతుకమ్మను స్వయంగా తయారు చేసి ఆకట్టుకున్నారు. విద్యార్థులు ఆటపాటలతో సందడి చేసి చేశారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఆకర్షణీయంగా తయారు చేసిన ఉత్తమ బతుకమ్మలకు తరగతుల వారీగా ప్రధానోపాధ్యాయుడు, రాష్ట్ర గ్రీన్ కోర్, జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్, రాష్ట్ర శిక్షకుడు గుండేటి యోగేశ్వర్ బహుమతులు అందజేశారు. బతుకమ్మలో పేర్చే పలు రకాల పూల విశిష్టత, ఔషధ గుణాలు, జీవవైవిధ్యం పాత్ర గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పొగ వెంకటేశ్వర్లు, న్యాయ నిర్ణేతలు వాణిశ్రీ, గ్రీన్ టీచర్ ఏ. సతీష్ కుమార్, కె.సంతోష్ కుమార్, బి. నర్సింగ్, ఉపాధ్యాయులు పావని, బిక్కు, విలాస్, అన్ని తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment