ఈనెల 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరుపుకోవడానికి ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని శ్రీరాంపూర్ సీఐ రమేష్ బాబు, శ్రీరాంపూర్ ఎస్సై రాజేశ్ అన్నారు. బుధవారం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని హిమ్మత్ నగర్ లో కాలనీ వాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీరాంపూర్ సీఐ, ఎస్సైలు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎలాంటి విభేదాలు తలెత్తకుండా ప్రచారం చేసుకోవాలని సూచించారు. అల్లర్లకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలకు లోబడి నడుచుకోవాలన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని, ఎన్నికలకు సంబంధించిన ర్యాలీ, సభలు, వెహికల్, మైక్ పర్మిషన్ లకు సువిధ యాప్ ద్వారా ఆన్ లైన్ లో అనుమతులు తీసుకోవాలన్నారు. 50 వేల రూపాయల కన్నా ఎక్కువ మొత్తంతో ప్రయాణం చేస్తే తగిన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని కోరారు. ఎన్నికలు ప్రశాంతంగా,సజావుగా జరగడానికి పోలీస్ వారికి సహకరించాలని కోరారు.
234