– జైపూర్ ఏసీపీ మోహన్
– అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఫ్లాగ్ మార్చ్
ఈ నెల 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును ఎలాంటి భయాందోళనకు లోనుకాకుండా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని జైపూర్ ఏసీపీ మోహన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ప్రజలలో భరోసా కల్పించేందుకు సోమవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సర్కిల్ పోలీసులు శ్రీరాంపూర్ బస్ స్టాండ్ నుండి ప్రగతి స్టేడియం, కటిక దుకాణాలు, హిమ్మత్ నగర్, కొత్త రోడ్ మీదుగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జైపూర్ ఏసీపీ మోహన్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రజలలో నమ్మకం కలిగించేందుకు ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పోలింగ్ రోజున సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కవాతులో శ్రీరాంపూర్ సీఐ రమేష్ బాబు, శ్రీరాంపూర్ ఎస్సై రాజేష్, జైపూర్ ఎస్సై ఉపేందర్ రావు, భీమారం ఎస్సై రాజవర్ధన్, శ్రీరాంపూర్ సర్కిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
270