తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం

– హామీలు అమలు చేయడంలో కెసిఆర్ ప్రభుత్వం విఫలం
–  సింగరేణి తెలంగాణకు గుండెకాయ
– బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్
– జై ఈటెల, సీఎం ఈటెల అంటూ బీజేపీ శ్రేణుల నినాదాలు
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ భీమా వ్యక్తం చేశారు. ఆదివారం మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఈటల రాజేందర్ మాట్లాడుతూ హామీలు అమలు చేయడంలో కెసిఆర్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని ధ్వజమెత్తారు. ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి, యువకుడు, ఉన్నత విద్యావంతుడైన వెరబెల్లి రఘునాథ్ ను కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.  తెలంగాణ రాష్ట్రానికి సింగరేణి సంస్థ గుండెకాయ లాంటిదని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం కార్మికుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చిందని, ఓపెన్ కాస్ట్ లో మట్టి వెలికి తీయాల్సిన కంపెనీలు ప్రస్తుతం బొగ్గు కూడా వెలికి తీస్తున్నాయని అన్నారు. సింగరేణి ప్రాంత ఓట్లు కేసీఆర్ కు కావాలంటే సింగరేణికి రావాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగకపోవడంతో కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే దేశంలో ఎక్కడా లేనివిధంగా క్వింటాల్ వరి ధాన్యానికి తరుగు లేకుండా 3100 రూపాయలు చెల్లిస్తామన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామనగానే  కొంతమంది పార్టీని వీడారని, బీసీలు అంటే వారికి అంత చిన్న చూపా అని అన్నారు. ఈటల రాజేందర్ మాట్లాడుతుండగా జై ఈటెల, సీఎం ఈటెల అంటూ బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణలో పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తానని, నిరుద్యోగ భృతి, ఇండ్ల స్థలాలు, రుణ మాఫీ చేస్తామని  మోసం చేసిన ఘనుడు కేసీఆర్ అని, అర చేతిలో బెల్లం పెట్టి మోచేతి నాకించు రకం కేసీఆర్ అని అన్నారు. హుజురాబాద్ లో తనను ఓడించడానికి 600 కోట్లు ఖర్చు చేశారని, దళిత బంధు పథకంలో భాగంగా  రెండు వేల కోట్లు చెల్లించారన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుండి వచ్చిన పలువురికి ఈటల రాజేందర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment