క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం

– జీఎంలు జక్కం రమేష్, బి. సంజీవ రెడ్డి
నస్పూర్, ఆర్.కె న్యూస్
క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం కలుగుతుందని జనరల్ మేనేజర్ కార్పొరేట్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) జక్కం రమేష్, శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డి అన్నారు. శనివారం నస్పూర్ పట్టణంలోని సింగరేణి బంగ్లా ఏరియా ఇల్లందు క్లబ్ లో క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి, సింగరేణి వ్యాప్తంగా ఉన్న 28 అధికారుల క్లబ్ సభ్యులకు టెన్నికాయిట్, షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ క్రీడలను నిర్వహించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్లు మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా ఉన్న అధికారుల కుటుంబ సభ్యులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొనడం చాలా సంతోషకరమని,  క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన ప్రదర్శించాలని కోరారు.ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం సింగరేణి సంస్థలో ఉండడం అభినందనీయమని అన్నారు. క్రీడాకారులు గెలుపోటములను పక్కనపెట్టి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సేవా అధ్యక్షురాలు రాధా కుమారి సంజీవరెడ్డి, అధికారుల సంఘం సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ఏవీ రెడ్డి, శ్రీరాంపూర్ ఏరియా అధికారుల సంఘం అధ్యక్షులు అబ్దుల్ ఖదీర్, క్రీడల కన్వీనర్ డాక్టర్ రమేష్ బాబు, కో – కన్వీనర్ తిరుపతి, అన్ని ఏరియాల అధికారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment