శ్రీరాంపూర్ లో ఘనంగా అయ్యప్ప మహా మండల పడిపూజ

– అయ్యప్ప మాలధారణతో భక్తి, క్రమశిక్షణ
– 3 జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు
– నిప్పుల్లో నడిచిన 2 వేల మంది అయ్యప్ప స్వాములు
–  అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిన శ్రీరాంపూర్

మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని  శ్రీరాంపూర్ కాలనీ ప్రగతి స్టేడియం వద్ద హనుమాన్ మందిర్ లో శుక్రవారం అర్ధరాత్రి వరకు  అయ్యప్ప స్వాముల మహా సంగమం, మండల పడిపూజ ఘనంగా నిర్వహించారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచార సభ శ్రీరాంపూర్ శాఖ అధ్యక్షులు బొడ్డు లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు మేడవేన  చందర్, ప్రధాన కార్యదర్శి భాస్కర్ల రాజేశం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు, భక్తులు, 108 మంది మహిళలు, దివ్య జ్యోతులు, మంగళహారతులతో ఆర్కే 8 కాలనీ గణేష్ మందిర్ నుంచి బయలు దేరి శ్రీరాంపూర్ పురవీధుల్లో నగర సంకీర్తన, అయ్యప్ప స్వాములు పేటతుళ్ళి నృత్యాలతో శోభయాత్ర నిర్వహించారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తి గీతాలతో, శరణుఘోష చేసుకుంటూ మంగళ వాయిద్యాలతో దేవతా మూర్తుల చిత్రపటాలతో శోభా యాత్రతో ప్రగతి స్టేడియం వద్ద గల హనుమాన్ మందిరానికి చేరుకున్నారు. అనంతరం కేరళ తాంత్రికులు సంజీవ నంబూద్రి గురు స్వామిచే అయ్యప్ప స్వాముల మహా సంగమం, మహా మండల పడిపూజ, 18 దివ్య పదునెట్టాంబడి కలుశాల పూజ, అభిషేకాలు నిర్వహించారు. 18 కళశాల పూజ 18 రకాల పూలాభిషేకం, నైవేద్యాలు ఏర్పాటు చేసి భక్తులను దైవ చింతనలో ముంచేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద రెడ్డి, నడిపెల్లి దివాకర్ రావు, మాజీ జడ్పీటీసీ రాచకొండ ఆశాలత వెంకటేశ్వర్ రావులు భక్తులకు అన్నదానం, తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేశారు. ఏబీఏపీ రాష్ట్ర అధ్యక్షుడు బేతి తిరుమల్ రావు , వనపర్తి రాజేష్ లు  పాల్గొని పూజలు చేశారు. పూజ కోసం అరటి చెట్లతో నీలాద్రి, చారి గురుస్వాముల మిత్ర బృందంచే నిర్మించిన తాత్కాలిక పూజా మందిరాలు భక్తులకు కనువిందు చేశాయి. ఈ సందర్భంగా నంబూద్రి గురు స్వామి అయ్యప్ప దీక్షా వ్రత ప్రాశస్యాన్ని కేరళ తాంత్రిక పూజా విధానాన్ని వివరించి అయ్యప్ప స్వాములచే సామూహికంగా పడిపూజ చేయించారు. దీక్ష చేపట్టిన భక్తుల్లో భక్తి, క్రమశిక్షణ పెరుగుతుందన్నారు. దీక్ష వారి నుంచి చెడు అలవాట్లు, వ్యసనాలు దూరం చేసుకొంటనే దీక్షకు సార్ధకత ఉంటుందన్నారు. మంచిర్యాల మార్వాడి కాలు భజన బృందం ఆలపించిన భక్తిగీతాలు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. భక్తి గీతాలు మనోరంజకంగా ఉన్నాయి. పూజా మందిరాలను నిర్వాహకులు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించడం అందరికి కనువిందు చేసింది. పడి పూజకు మహారాష్ట్ర సిరివంచ , పెద్దపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల నుంచి అయ్యప్ప భక్తులు హాజరయ్యారు.

పాప ప్రక్షాలణకు నిప్పుల్లో నడిచిన అయ్యప్పలు…
శ్రీరాంపూర్ అయ్యప్ప స్వాములు, భక్తులు మహా మండల పడిపూజ కార్యక్రమంలో భాగంగా భక్తులు పాప ప్రక్షాలణకై భగభగ మండే  ఎర్రటి నిప్పులు (అగ్నిగుండాలు)ల్లో 2 వేల మంది అయ్యప్ప స్వాములు నడిచారు. రాత్రి ఒంటిగంట వరకు కూడా ఎంతో ఆసక్తితో అఖండ భజన కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులు పూజలో పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి శరణు ఘోష నామస్మరణతో శ్రీరాంపూర్ కాలనీ మారు మ్రోగింది. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచార సభ శ్రీరాంపూర్ సలహాదారులు తోట వెంకటేశం, ప్రధాన కార్యదర్శి భాస్కరి రాజేశం, ఉపాధ్యక్షులు వంగ శివకుమార్, కార్యదర్శి ముల్కల్ల రవికృష్ణ, సాదుల సురేందర్, ఐలయ్య, హరీష్, శ్రావణ్, బన్నీ, సిహెచ్ లోహిత్, పుట్ట రవి, ప్రసాద్, బొద్దున రమేష్, చారి, రామలింగం, కుమారస్వామి, ఆర్ మధు, క్రాంతి, దాసరి నవీన్, సీహెచ్ సదానందం, వేణు, రమేష్, శివారెడ్డి, బొద్దిరెడ్డి సురేందర్ రెడ్డి, రంజిత్, ఐలయ్య, వంగ శ్రీనివాస్ పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment