గీతా జయంతి, శ్రీమద్భగవద్గీత సత్సంగం రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయండి

ఆర్.కె న్యూస్, నస్పూర్
నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని క్రిష్ణ కాలనీ గీత ప్రశాంతి నిలయంలో నిర్వహిస్తున్న గీతా జయంతి, శ్రీమద్భగవద్గీత సత్సంగం రజతోత్సవ వేడుకలకు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సత్సంగ అధ్యక్షులు భక్త రాజేశం గురూజీ తెలిపారు. బుధవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ, ఈ నెల 13 నుండి 23 వరకు నిర్వహిస్తున్న వేడుకలలో శ్రీహరి మౌనస్వామి, విష్ణు సేవా నందగిరి స్వాములు వస్తున్నారని, అనేక ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుకుంటూ, పూజలు, యజ్ఞములతో పాటు అనేక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కోలాట, భజనలతో శోభాయాత్ర ఉంటుందన్నారు. పాఠశాల విద్యార్థులచే భగవద్గీత పారాయణం ఉంటుందన్నారు. భగవద్గీతను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, భగవద్గీతను అధ్యనం చేయడం ద్వారా ఆధ్యాత్మిక తత్వం పెంపొందుతుందన్నారు. మంచి పనులు చేస్తూ, శాంతి, భక్తి మార్గంలో జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో మారపెల్లి సారయ్య, డిడి ప్రసాద్, లక్ష్మీనారాయణ, సాంబారి రాజేశం, రాంబాబు, రాజమౌళి, రాజేశ్వరి, స్వర్ణ, లక్ష్మి, సత్యవతి, రమదేవి, అనసూయ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment