ఆర్.కె న్యూస్, నస్పూర్
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 99వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం నస్పూర్ పట్టణ సమితి ఆధ్వర్యంలో షిర్కే సెంటర్ లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, నస్పూర్ కాలనీ శాఖలో సిపిఐ పట్టణ కార్యదర్శి రాజేశ్వరరావు, నాగార్జున కాలనీ శాఖలో సీనియర్ నాయకులు కంచం పోషంలు పార్టీ జెండా ఆవిష్కరించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ మాట్లాడుతూ ఈనెల 20 నుండి 26 వరకు జరుగనున్న సిపిఐ 99వ ఆవిర్భావ వేడుకలు పట్టణ, మండల, గ్రామ స్థాయిలో అరుణ పతాకాన్ని ఎగురవేసి ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. 1925 డిసెంబర్ 26న కాన్పూర్ లో సిపిఐ ఆవిర్భవించిందని, పార్టీ ఆవిర్భావం నుండి దున్నే వారికి భూమి కావాలని పోరాటాలు చేసిందని, నేటి వరకు బడుగు, బలహీన వర్గాలు, పేద ప్రజలు, కార్మికులు, కర్షకుల సమస్యల పై ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉందన్నారు. సిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ, ప్రజా సంఘాలు, కార్మికులు, కర్షకులు, మేధావులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, మండల సహయ కార్యదర్శి లింగం రవి, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు, జిల్లా సమితి సభ్యులు మోత్కూరి కొమురయ్య, కోడి వెంకటేశం, దొడ్డిపట్ల రవిందర్, తంగళ్ళపల్లి సురేష్, అల్ల లచ్చి రెడ్డి, దాడి రాజయ్య, జడల శ్రీనివాస్, డీకొండ మల్లయ్య, రషీద్, రావుల రాజయ్య, గద్దె నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.
294