ఆర్.కె న్యూస్, నస్పూర్: క్యాన్సర్ తో బాధపడుతున్న శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే8 డిస్పెన్సరీలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి అశోక్ భార్య శారదకు డిస్పెన్సరీ ఉద్యోగులు 21,100 రూపాయల ఆర్థిక సహాయాన్ని జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ డిస్పెన్సరీ ఉద్యోగులు తమ తోటి ఉద్యోగిని ఆపద కాలంలో ఆర్థికంగా ఆదుకోవడం హర్షణీయమని, ఆపదలో ఉన్న వారికి తమ సహాయ, సహకారాలు అందించాలని డిస్పెన్సరీ ఉద్యోగులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం రఘు కుమార్, ఏజీఎం (ఫైనాన్స్) మురళీధర్, డీజీఎం (పర్సనల్) పి. అరవింద రావు, డీజీఎం (సివిల్) ఆనంద్ కుమార్, క్వాలిటీ మేనేజర్ వెంకటేశ్వర రెడ్డి, డివైసీఎంఓ రమేష్ బాబు, డాక్టర్లు వేదవ్యాస్, లోకనాథ్ రెడ్డి, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
208