సమిష్టి కృషితో వార్షిక లక్ష్యాన్ని సాధిస్తాం

– సింగరేణిలో శ్రీరాంపూర్ ఏరియాకు ప్రత్యేక స్థానం
– శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి
ఆర్.కె న్యూస్, నస్పూర్: అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకుల సమిష్టి కృషితో శ్రీరాంపూర్ ఏరియా నిర్ధేశిత వార్షిక లక్ష్యాన్ని సాధిస్తామని కృషి చేస్తామని శ్రీరాంపూర్ ఏరియా జీఎం బి. సంజీవ రెడ్డి తెలిపారు. సోమవారం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ, శ్రీరాంపూర్ ఏరియా వార్షిక లక్ష్యం 66.4 మిలియన్ టన్నులు కాగా, ఇప్పటి వరకు  40.01 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు, మిగిలిన మూడు నెలల్లో వంద శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. డిసెంబర్ నెలలో ఆర్కే5 గని 99 శాతం, ఆర్కే6 గని 103 శాతం, ఆర్కే7 గని 80 శాతం, ఆర్కే న్యూటెక్ గని 96 శాతం, ఎస్సార్పీ 3 గని 85 శాతం, ఎస్సార్పీ 1 గని 67, ఐకే1ఏ గని 75 శాతం ఉత్పత్తితో  భూగర్భ గనులు 86 శాతం ఉత్పత్తి సాధించాయని, ఎస్సార్పీ ఓసిపి 100 శాతం, ఐకే ఓసిపి 73 శాతం ఉత్పత్తితో శ్రీరాంపూర్ ఏరియాలో 91 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించామని తెలిపారు. సింగరేణిలో విద్యుత్ వాడకం 540 మెగావాట్లు ఉందని, కావాల్సిన విద్యుత్  ఉత్పత్తికి సింగరేణి సంస్థ ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. చెన్నూర్ లో ఉన్న 75 ఎకరాలలో 11 మెగావాట్లు, 100 ఎకరాల్లో 27.8 మెగావాట్ల ఉత్పత్తి చెన్నూర్ లో మొత్తంగా 39 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా శ్రీరాంపూర్ ఏరియాకు ఒక ప్రత్యేక స్థానం ఉందని, స్వచ్ఛత పక్వాడాలో మళ్లీ శ్రీరాంపూర్ ఏరియాకే మొదటి బహుమతి వచ్చిందని, వరుసగా రెండు సంవత్సరాలు మొదటి బహుమతి రావడం హర్షణీయమని  అన్నారు. ఎస్డీఎల్ యంత్రాల పని తీరులో ఆర్కే6 గనికి కూడా మొదటి బహుమతి, ఐకె 1ఏ గనికి బెస్ట్ మాన్ రైడింగ్ సిస్టం అవార్డు, కోల్ మినిస్ట్రీ ఎస్సార్పీ 1 గనికి 5 స్టార్ రేటింగ్ ఇచ్చిందన్నారు. ఇటీవల జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు సమిష్టి కృషితో విజయవంతంగా నిర్వహించామని, త్వరలో శ్రీరాంపూర్ ఏరియాలో ప్రజలకు అందుబాటులో ఎకో పార్కు ఏర్పాటు చేస్తామన్నారు.  అతి త్వరలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయన్నారు.  గత ఏడాది 384 మంది సింగరేణి ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు కల్పించామని, పోలీస్ ఉద్యోగాల కోసం సింగరేణి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 197 మంది అభ్యర్థులలో 26 మంది ఉద్యోగాలు సాధించారని, సింగరేణి సేవా  సమితి ఆధ్వర్యంలో వృత్తి శిక్షణ కోర్సులలో 473 మంది  శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు. ఈ నెల 18 నుండి 4 రోజుల పాటు  శ్రీరాంపూర్ లో కోల్ ఇండియా స్థాయి హాకీ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం రఘుకుమార్, డీజీఎం (పర్సనల్) పి. అరవింద రావు, డీజీఎం (ఐఈడి) చిరంజీవులు, ఏజెంట్లు ఏవి రెడ్డి, మాలోత్ రాముడు, క్వాలిటీ మేనేజర్ వెంకటేశ్వర రెడ్డి, సీనియర్ పిఓ పి. కాంత రావు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment