ఆర్.కె న్యూస్, నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-న్యూటెక్ గనిపై గనుల్లో పాటించాల్సిన రక్షణ సూత్రాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బెల్లంపల్లి రీజియన్ జీఎం (రక్షణ) కె. హరి నారాయణ గుప్తా ఉద్యోగులకు అవగాహన కల్పించారు. బుధవారం గని ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులందరికీ గనుల్లో జరిగే ప్రమాదాలపై పూర్తి అవగాహన ఉండాలని అన్నారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యక్తిగత రక్షణ పరికరాలు ధరించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మానవ ప్రమేయ ప్రమాదాలను తగ్గించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం ఉద్యోగులతో కలిసి రక్షణ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ ఏజెంట్ మాలోత్ రాముడు, గని ఎస్ఓఎం స్వామి రాజు, రక్షణాధికారి కొట్టె రమేష్, సంక్షేమాధికారి పాల్ సృజన్, ఇంజనీర్ కృష్ణ, వెంటిలేషన్ అధికారి చంద్రమౌళి, సర్వే అధికారి పిచ్చేశ్వర్ రావు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
209