నిర్దేశిత వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

  • మల్టీ డిపార్టుమెంట్ బృందం కన్వీనర్ రఘు కుమార్
  • ఆర్కే-న్యూటెక్ గనిలో మల్టీ డిపార్టుమెంటల్ సమావేశం

ఆర్.కె న్యూస్, నస్పూర్: నిర్దేశిత వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీరాంపూర్ ఏరియా మల్టీ డిపార్టుమెంట్ బృందం కన్వీనర్ రఘు కుమార్ అన్నారు. శ్రీరాంపూర్ ఏరియా జీఎం బి. సంజీవరెడ్డి మార్గనిర్దేశంలో శనివారం ఆర్కే- న్యూటెక్ గనిపై మల్టీ డిపార్టుమెంటల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీరాంపూర్ ఏరియా మల్టీ డిపార్టుమెంట్ బృందం కన్వీనర్ రఘు కుమార్ హాజరై సంస్థ స్థితిగతులను ఉద్యోగులకు వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సింగరేణిలో ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగితే సంస్థ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. నిర్దేశిత వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పని స్థలాల్లో రక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నాణ్యమైన బొగ్గును సకాలంలో వినియోగదారులకు చేరవేసినప్పుడే ఆర్థిక ప్రయోజనం కలుగుతుందన్నారు. భూగర్భ గనుల్లో ఖర్చు తగ్గిస్తూ, యంత్రాల పని గంటలు పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తదుపరి ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి శ్రీ ఎస్కే బాజీ సైదా మాట్లాడుతూ ఉద్యోగులు విధులకు గైర్హాజరు కాకుండా ఉండాలన్నారు. గనుల్లో వివిధ కేటగిరి పనులు స్వీకరించేందుకు ముందుకు రావాలని సూచించారు. కార్మికులకు మెరుగైన డిమాండ్లు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అనంతరం ఎండీటీ కమిటీ బృందం సభ్యులు దృశ్య మాధ్యమం ద్వారా పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ ఏజెంట్ మాలోత్ రాముడు, మల్టీ డిపార్టుమెంటల్ బృందం సభ్యులు ఏరియా ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి, డీజీఎం (ఐఈడీ) చిరంజీవులు గారు, డీజీఎం (పర్సనల్) అరవిందరావు, ఏరియా రక్షణాధికారి శ్రీధర్ రావు, డీవైఎఫ్ఎం నరేష్, సీనియర్ ప్రోగ్రామర్ జి.శ్రీనివాస్, గని ఎస్ఓఎం ఇ. స్వామి రాజు, ఏఐటీయూసీ పిట్ కార్యదర్శి ఆకుల లక్ష్మణ్, గని రక్షణాధికారి కొట్టె రమేష్, పిట్ ఇంజనీర్ రాజగోపాలచారి, ఇంజనీర్ కృష్ణ, సర్వే అధికారి శ్రీ పిచ్చేశ్వర్ రావు, ఇతర అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment