మేడారం జాతరపై నమూనా జడ్పీ సమావేశం

  • అలరించిన పారుపల్లి విద్యార్థులు 
  • సురక్షితమైన పర్యావరణహిత జాతర జరుపుకోవాలని సభలో తీర్మానాలు, ప్రతిజ్ఞ

ఆర్.కె న్యూస్, మంచిర్యాల: రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ప్రత్యేక ఆదేశాల మేరకు మంచిర్యాల కోటపల్లి మండలం పారుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో   మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో పర్యావరణ రక్షణ, కాలుష్యం, సింగిల్ యూజ్ నివారణ, ప్రజారోగ్యం, చెత్త నిర్వహణ, విచ్చల విడి జంతు బలి తదితర అంశాలపై అవగాహన కల్పించే విద్యార్థుల మోడల్ జిల్లా పరిషత్ సమావేశం నిర్వహించారు. విద్యార్థులే జిల్లా అధికారులుగా, అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకులు, మీడియా ప్రతినిధులుగా విభిన్న పాత్రలను వేషధారణతో పోషించి అబ్బురపరిచారు. అధికార, ప్రతిపక్ష పార్టీల వాదోపవాదాల మధ్య సభ వేడెక్కింది. ఆశ్చర్యపరిచే పలు డైలాగులతో నవ్వులు పండించారు. చిట్టచివరకు అందరూ ఏకాభిప్రాయానికి  వచ్చి పలు తీర్మానాలు చేశారు. జాతరకు వెళ్లే భక్తులు బట్ట సంచులు  తీసుకెళ్లాలని, కాలుష్య కారకాలుగా మారకూడదని, నీరు, ఇతర వనరుల పొదుపు, ఆర్.ఆర్.సి సౌకర్యం, టాయిలెట్స్ వినియోగం పై అవగాహన కల్పించారు. జంపన్న వాగు కలుషితం చేయొద్దని సభలో అందరూ ప్రతిజ్ఞ చేశారు. పలు సందేశాలను సభలో చర్చిస్తూ తీర్మానాలు సైతం చేసి రాష్ట్ర కాలుష్య నివారణ మండలికి నివేదిక పంపారు.  సమ్మక్క జాతరను అన్ని ప్రదేశాల్లో సురక్షితంగా జరుపుకోవాలని, పలు జాగ్రత్తలతో పర్యావరణ రక్షణ, కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని, జాతరకు వెళ్లే ప్రతి వ్యక్తి బట్ట సంచులు విధిగా తీసుకెళ్లాలని పలు నిర్ణయాలు చేశారు. కార్యక్రమాన్ని మార్గదర్శనం చేసి జిల్లాలో తొలి కార్యక్రమాన్ని ప్రారంభించిన విద్యాశాఖ పర్యావరణ జిల్లా కోఆర్డినేటర్, రాష్ట్ర శిక్షకుడు, హెడ్ మాస్టర్ గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ఈ నెల 24 తేదీలోగా నిర్వహించి, పర్యావరణ పరిరక్షణకు విద్యార్థుల ద్వారా మేడారం జాతర పై అవగాహన కలిగించాలి కోరారు. విద్యార్థులకు ఆర్ట్స్  టీచర్. కె సంతోష్ రంగాలంకరణ చేశారు. ఉపాధ్యాయులు టీ. పావని, ఎ .సతీష్, బి. నర్సింగ్, బి.బిక్కు, వాణిశ్రీ, విలాస్ జాదవ్ తదితర ఉపాధ్యాయులు కార్యక్రమ రూపకల్పనలో సహకరించారు. పి.టి.ఎం సమావేశానికి హాజరైన తల్లిదండ్రులు, స్థానికులు విద్యార్థుల ప్రతిభను, ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment