- సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్
- ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేత
ఆర్.కె న్యూస్ నస్పూర్: అంగన్వాడీ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం నస్పూర్ పట్టణంలోని జిల్లా కార్యాలయాల సమీకృత భవనంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు సంబంధించి గత సంవత్సరం దరఖాస్తులు తీసుకున్న అధికారులు ఇప్పటివరకు ఆ ప్రక్రియను పూర్తి చేయలేదని, ఈ విషయంలో అధికారులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికైనా బదిలీలు,పదోన్నతులు ఆలస్యం చేయకుండా వెంటనే చేపట్టాలని, బదిలీల్లో ఏలాంటి అవకతవకలకు తావులేకుండా అర్హులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మాజీ జిల్లా కార్యదర్శి సంకె రవి, అంగన్వాడీ ఉద్యోగులు, సిఐటియు నాయకులు శారద, ప్రవీణ, దుర్గ, మణిమల, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.