ఆర్.కె న్యూస్, నస్పూర్: దేశభక్తితో సైన్యంలో చేరాలనుకునే అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేకుండా క్లాసులు, ఫిజికల్ ట్రైనింగ్ ను కుమార్ గన్నర్స్ స్పోర్ట్స్ అండ్ డిఫెన్స్ అకాడమీ ద్వారా ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ కే.కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోచింగ్ తీసుకోదలచిన అభ్యర్థులు ఎలాంటి డాకుమెంట్స్, ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఆర్మీ ఇన్స్ట్రక్టర్ చే అకాడమీ నిర్వహిస్తూ ఎంతో మంది నిరుపేద విద్యార్థులను సైన్యంలోకి ఎంపికయ్యేలా చేసినట్లు, స్టడీ మెటీరియల్ తో పాటు క్లాసులు, కోచ్, పీఈటిలతో ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు నస్పూర్ పట్టణంలోని రాయల్ టాకీస్ వద్ద గల కోచింగ్ సెంటర్ లో సంప్రదించాలని తెలిపారు.
217