- ఈనెల 25,26 తేదీల్లో జరిగే అఖిల భారత విద్యార్థుల సదస్సు
- భారత్ బచావో జిల్లా అధ్యక్షులు కనుకుంట్ల మల్లయ్య
ఆర్.కె న్యూస్, నస్పూర్: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విద్యా కాషాయికరణ, కార్పొరేటీకరణ ప్రేరేపిస్తూ శాస్త్రీయ విద్య స్థానంలో మనువాద సిద్ధాంతాన్ని అమలు పరచడంలో భాగంగా నూతన జాతీయ విద్యా విధానం 2020ను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందని భరత్ బచావో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కునుకుంట్ల మల్లయ్య అన్నారు. మంగళవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, ఈనెల 25, 26 తేదీల్లో హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత విద్యార్థుల సదస్సు నిర్వహించడం జరుగుతుందని, ఈ సదస్సులో మేధావులు, ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. నూతన జాతీయ విద్యా విధానం 2020 వలన బడుగు బలహీన అణగారిన వర్గాలకు విద్య వ్యవస్థలో జరిగే నష్టాలను ఈ సదస్సులో చర్చించడం జరుగుతుందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఫిలాసఫీ పరిశోధక విద్యార్థి ఆజాద్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ విద్యారంగాన్ని అస్తవ్యస్తం చేసిందని, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ -2020తో పాటు నూతన విద్యా పాఠ్య ప్రణాళిక-2023ను తీసుకొచ్చి స్వేచ్ఛ, సమానత్వం, లౌకితత్వం అనే రాజ్యాంగ విలువల స్థానంలో మనుధర్మన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారునీ, ఇందులో భాగంగా డార్విన్ సిద్ధాంతాన్ని తొలగిస్తాం, హెడ్గేవార్ పాఠాన్ని ప్రవేశ పెడతాం అని చెబుతున్నారన్నారు. విద్యా కాషాయికరణ, కార్పొరేటికరణ చేస్తూ పేద, బడుగు బలహీన మధ్య తరగతి వర్గాల విద్యార్థులకు విద్యను దూరం చేసే ప్రయత్నం జరుగుతున్న సందర్భంలో దేశ వ్యాప్త విద్యార్థులందరినీ ఏకం చేసి సమాన, శాస్త్రీయ విద్య కావాలని, అంత విశ్వాసాలను పెంచే విద్య విధానాలు వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భారత్ బచావో జిల్లా కార్యదర్శి ఇబ్రహీం, సమ్ము రాజయ్య, వడ్డేపల్లి మనోహర్, జి. సోమయ్య, ప్రభాకర్, రాజు, విద్యార్థి నాయకులు శ్రావణ్, గణేష్, విక్రమ్, సనత్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.