కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

ఏఐటీయూసీ నాయకులు

ఆర్.కె న్యూస్, నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె న్యూ టెక్ గని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం గని మేనేజర్ స్వామి రాజు కు ఏఐటీయూసీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కె. వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.కె బాజీ సైదాలు మాట్లాడుతూ మాట్లాడుతూ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగి మూడు నెలలు కావస్తున్నా సింగరేణి యాజమాన్యం ఇప్పటివరకు గుర్తింపు ధృవీకరణ పత్రాన్ని అందజేయకపోవడంతో కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. నూతన ఎస్.డి.ఎల్ యంత్రాలను అందుబాటులోకి తీసుకురావాలని, యాజమాన్యం కార్మికుల పై పని భారం తగ్గించాలని, కేటగిరి ప్రకారం కార్మికులకు పనులు కేటాయించాలని, క్యాంటీన్ లో మెనూ ప్రకారం నాణ్యమైన టిఫిన్స్ ఉద్యోగులకు అందించాలని, సపోర్ట్ మెన్లకు అవసరమైన పనిముట్లు పని స్థలాల్లో అందుబాటులో ఉంచాలని, వర్క్ నామ్స్ ప్రకారం కార్మికులకు పనులు కేటాయించాలని అన్నారు. ప్రమోషన్ పాలసీకి అనుగుణంగా కార్మికులను ఒకే పనికి పంపించకుండా అన్ని పనులకు పంపించడం వల్ల ప్రమోషన్లు రాకుండా అన్యాయం జరుగుతుందన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు కొట్టె కిషన్ రావు, ఏరియా కార్యదర్శి సంపత్, పిట్ కార్యదర్శి ఆకుల లక్ష్మణ్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, పిట్ సహాయ కార్యదర్శి సందీప్, నాయకులు నరసయ్య, శంకరయ్య, సిద్ధం అజయ్, నారాయణ, మల్లేష్, శ్రీకాంత్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment