బైరాన్ పల్లి చిత్రాన్ని ఆదరించాలి

  • చిత్ర నిర్మాత నరేష్ వర్మ

ఆర్.కె న్యూస్, నస్పూర్: గత నెల 28 నుంచి ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమింగ్ అవుతున్న బైరాన్ పల్లి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని చిత్ర నిర్మాత నరేష్ వర్మ కోరారు. శనివారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్ పై తెలంగాణ కళాకారులతో స్థానికంగా నిర్మించిన బైరాన్ పల్లి చిత్రం గత ఏడాది జూన్ 9న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందిందని తెలిపారు. ఉత్సాహవంతులైన కళాకారులకు తమ రాబోవు చిత్రాల్లో అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రస్తుతం తిర్యాణి చిత్రం నిర్మాణ దశలో ఉందన్నారు. యూట్యూబ్ లో విడుదల చేసే లఘు చిత్రాలకు, సినిమాలకు చాలా తేడా ఉంటుందన్నారు. తమ చిత్రంలో నటించిన నటీనటులకు మంచి అవకాశాలు వస్తున్నాయని తెలిపారు.  ఈ కార్యక్రమంలో నటులు గజెల్లి రాజలింగు, గురుమూర్తి, రాజేష్, సందేశ్, రహీం తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment