- శ్రీరాంపూర్ ఎస్సై మేకల సంతోష్
ఆర్.కె న్యూస్, నస్పూర్: రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని శ్రీరాంపూర్ ఎస్సై మేకల సంతోష్ అన్నారు. ఆదివారం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణ కాలనీలో సిఆర్పిఎఫ్ బలగాలతో కలిసి శ్రీరాంపూర్ ఎస్సై, సిబ్బంది కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఎస్సై మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి కృష్ణ కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి, వాహనాల ధృవ పత్రాలు తనిఖీ చేసినట్లు తెలిపారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని స్థానికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, సిఆర్పిఎఫ్ బలగాలు తదితరులు పాల్గొన్నారు.