163
- బిఎంఎస్ లో పలువురి చేరిక
ఆర్.కె న్యూస్, నస్పూర్: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సింగరేణి సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలపై 40 శాతం లాభాల వాటను కార్మికులకు జూన్ మాసంలో చెల్లించుటకు చర్యలు తీసుకోవాలని బిఎంఎస్ బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్, సీఎంపిఎఫ్ ట్రస్ట్ బోర్డు సభ్యులు కొత్త కాపు లక్ష్మారెడ్డి తెలిపారు. ఆదివారం నస్పూర్ పట్టణంలో జరిగిన బిఎంఎస్ కార్యవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ, సింగరేణి సంస్థలో కొత్త గనుల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని కోరారు. సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఆదాయ పన్ను, సొంతింటి కల, మెరుగైన వైద్యం, విద్య, నూతన బొగ్గు గనుల ఏర్పాటుకు సంబంధిత పరిశ్రమ ద్వారా కృషి చేయాలని, భూగర్భ గనుల్లో తరచూ జరుగుతున్న గని ప్రమాదాల నివారణకు, జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలను కొనసాగించుటకు, నిరంతర ఆందోళన ఉద్యమ కార్యక్రమాలు చేయాలని, భూగర్భ గనుల్లో వెంటిలేషన్ సదుపాయాలు మెరుగుపరుచుటకు కొత్త టెక్నాలజీ ద్వారా సరైన వెంటిలేషన్ సదుపాయాలు అందించుటకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం యూనియన్ కార్యక్రమాలకు ఆకర్షితులైన వివిధ యూనియన్ల నుండి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ లో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బిఎంఎస్) అధ్యక్షులు యాదగిరి సత్తయ్య, మాధవ నాయక్, టీఎస్ పవన్ కుమార్, మండ రమకాంత్, వేణుగోపాలరావు, శ్రీనివాసరాజు, సారంగపాణి, పెండ్లి మోహన్ రెడ్డి, నాతాడి శ్రీధర్ రెడ్డి, డోనికల రమేష్ గౌడ్, చెట్టు వీరన్న తదితరులు పాల్గొన్నారు.