ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందన

ఆర్.కె న్యూస్, నస్పూర్: ఇటీవల విడుదలైన పదో  తరగతి ఫలితాల్లో అత్యధిక గ్రేడ్ పాయింట్లు సాధించిన సిసిసి సింగరేణి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఏ. లక్ష్మీ ప్రసన్న, ఎన్. నవ్య శ్రీ, కె. ఆశ్రిత, కె. అభిజ్ఞ సాయి నందు, జి. అక్షరలను శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవరెడ్డి , జనరల్ మేనేజర్ (సేఫ్టీ, కార్పొరేట్) గురువయ్య, జనరల్ మేనేజర్ (సేఫ్టీ, బెల్లంపల్లి రీజియన్) కె రఘు కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్లు మాట్లాడుతూ పదో తరగతిలో అత్యధిక గ్రేడ్ పాయింట్లు సాధించిన విద్యార్థులు పై చదువులలో ఉత్తమ ప్రతిభ కనబర్చి, ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులు, విద్య నేర్పిన గురువులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం వి. పురుషోత్తమ రెడ్డి, అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు కే. వెంకటేశ్వర్ రెడ్డి, ఏజీఎం (ఫైనాన్స్) మురళీధర్, డీజీఎం (పర్సనల్) పి. అరవింద రావు, పర్సనల్ మేనేజర్, కరస్పాండెంట్ ఏ.  రాజేశ్వర్, పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణమూర్తి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment