- శ్రీరాంపూర్ జీఎం బి సంజీవ రెడ్డి
ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డి అన్నారు. గురువారం నస్పూర్ పట్టణంలోని ప్రాణహిత మైదానంలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని శ్రీరాంపూర్ జీఎం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఉద్యోగులకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, వారి పిల్లలకు వేసవి క్రీడా శిబిరాలు నిర్వహిస్తుందని అన్నారు. ఉద్యోగుల పిల్లలు వివిధ క్రీడల్లో నైపుణ్యం పొందడానికి శిక్షణ అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డీజీఎం (పర్సనల్) రాజేశ్వర్, సీనియర్ పీవో పి. కాంతారావు, స్పోర్ట్స్ హానరరీ సెక్రటరీ సృజన్ పాల్, స్పోర్ట్స్ సూపర్వైజర్ చాట్ల అశోక్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్, తోట సురేష్, శిక్షకులు తదితరులు పాల్గొన్నారు.