తపాలా పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

  •  మంచిర్యాల తపాలా సహయ పర్యవేక్షకులు రాథోడ్ రామారావు

ఆర్.కె న్యూస్, నస్పూర్: ప్రజలు తపాలా పథకాలు, సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల తపాలా శాఖ సహాయ పర్యవేక్షకులు రాథోడ్ రామారావు అన్నారు. మంగళవారం తపాలా శాఖ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ పోస్ట్ ఆఫీస్ ఆవరణలో వివిధ తపాలా పథకాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మంచిర్యాల తపాలా శాఖ సహాయ పర్యవేక్షకులు మాట్లాడుతూ పోస్టాఫీసులు ప్రజల అవసరాలకు అనుగుణంగా డిజిటల్ గా రూపాంతరం చెందాయని, వివిధ పొదుపు, జీవిత బీమా, ప్రమాద బీమా పథకాలు అందిస్తున్నాయని తెలిపారు. గ్రూప్ యాక్సిడెంటల్ గార్డ్ పాలసీలు కేవలం సంవత్సరానికి కేవలం 520 రూపాయలతో 10 లక్షలు, 749 రూపాయలతో 15 లక్షల ప్రమాద బీమా కవరేజి అందిస్తోందని తెలిపారు. ఈ బీమా రోడ్డు ప్రమాదం విద్యుత్ షాక్, పాము కాటుతో పాటు ఏదైనా ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే ఈ బీమా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. 18 నుంచి 65 ఏళ్ల వయస్సు గల ప్రతి వ్యక్తి ఈ పాలసీ తీసుకోవాలని, కుటుంబ సభ్యుల భద్రతను కాపాడుకోవాలని సూచించారు . ఈ సమావేశంలో శ్రీరాంపూర్ సబ్ పోస్ట్ మాస్టర్ సందీప్, రమేష్, సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment