సింగరేణికి రావాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాలి

  • 35 శాతం లాభాల వాటా చెల్లించాలి
  • ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య
  • ఏఐటీయూసీలో చేరికలు

ఆర్.కె న్యూస్, నస్పూర్:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన 27 వేల కోట్ల రూపాయల బకాయిలు తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు, వేజ్ బోర్డు శాశ్వత సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. శుక్రవారం సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్  ఉపరితల గనిలో ఏర్పాటు చేసిన ద్వార సమావేశానికి ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సింగరేణి సొమ్మును దుర్వినియోగం చేస్తుందన్నారు. సింగరేణి యాజమాన్యం సంస్థ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వాలకు మళ్లించకుండా, కార్మికుల సంక్షేమానికి ఉపయోగించాలన్నారు. గత ఆర్థిక సంవత్సరం సింగరేణి సంస్థకు వచ్చిన లాభాలను వెంటనే ప్రకటించి, లాభాల్లో 35 శాతం వాటా కార్మికులకు చెల్లించాలని కోరారు. సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులందరికీ రెండు గుంటల ఇంటి స్థలం, 20 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇప్పించాలన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల సింగరేణి సంస్థ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, నూతన బొగ్గు బావులు ఏర్పాటు చేయాలన్నారు. ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అని చెప్పే సింగరేణి యాజమాన్యం పెరిక్స్ పై ఆదాయపు పన్ను అధికారులకు యాజమాన్యమే చెల్లిస్తుందని, కానీ కార్మికులకు ఎందుకు చెల్లించడం లేదని సందర్భంగా ప్రశ్నించారు. ఉపరితల గనిలో నూతన యంత్రాలు కొనుగోలు చేయాలన్నారు. అనంతరం పలు కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు సీతారామయ్య సమక్షంలో ఏఐటీయూసీలో చేరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కే బాజీ సైదా, బ్రాంచ్ సంయుక్త కార్యదర్శి రాచర్ల చంద్రమోహన్, జీఎం చర్చల ప్రతినిధి బద్రి బుచ్చయ్య, మారుపెల్లి బాబు, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, గునిగంటి నరసింగా రావు, ఫిట్ సహాయ కార్యదర్శి నల్ల సత్తయ్య, నాయకులు మోహన్ రెడ్డి, ఆళ్ల వెంకటరెడ్డి, శంకర్, బానోత్ సరోజ, మైనింగ్ స్టాప్ నాయకులు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment