ఆర్.కె న్యూస్, నస్పూర్: నస్పూర్ పట్టణంలోని లిటిల్ రోబోస్ ప్లే స్కూల్ లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం పాఠశాల చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలు ధరించి, ఆటపాటలతో అలరించారు. వేడుకల్లో భాగంగా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో పాఠశాల ప్రిన్సిపాల్ వూట్ల సత్యనారాయణ, ట్రస్మా నస్పూర్ మండల అధ్యక్షుడు మైదం రామకృష్ణ, మంచిర్యాల కోశాధికారి బండారి మమత, లత, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
149