ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అవుతుంది

  • అభివృద్ధి పనులకు ఈ నెలలో శంకుస్థాపన
  • మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

ఆర్.కె న్యూస్, మంచిర్యాల: ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అవుతుందని, రెండు లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో అపోహలు వద్దని, సాంకేతిక కారణాల వల్ల కొంత జాప్యం జరుగుతోంది తప్ప ఏ రైతుకు నష్టం జరగదని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆదివారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ… మంచిర్యాల నియోజకవర్గంలో ఈ నెలాఖరు లోపు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  తెలిపారు. ఐబీ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపడతామని, శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ జాతీయ నేతలు హాజరవుతారని చెప్పారు. రాళ్లవాగు వరద ముంపు రాకుండా కరకట్ట నిర్మాణం చేపడతామని, ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన జరుగుతుందన్నారు. ముల్కల్ల నుంచి బసంత్ నగర్ వరకు గోదావరి నదిపై 375 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని, రెండవ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం కేంద్రానికి ప్రతిపాదన వెళ్లాయని తెలిపారు. 164 కోట్లతో శ్రీనివాస గార్డెన్ నుండి క్వారీ రోడ్, పాత మంచిర్యాల మీదుగా నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు వెళ్లాయని చెప్పారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. తాను ఏ హోదాలో ఉన్నా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గంలోని  ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అవినీతి సహించబోమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు భూ ఆక్రమణదారులకు మద్దతు ఇవ్వడం శోచనీయమని అన్నారు. తదుపరి మంచిర్యాల, నస్పూర్, లక్సెట్టిపేట మున్సిపాలిటీలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment