సింగరేణి కార్మికులకు అక్టోబర్ లో లాభాల వాటా చెల్లింపు

  • కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
  • ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్

ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి కార్మికులకు గత ఆర్థిక సంవత్సర లాభాల వాటా అక్టోబర్ నెలలో యాజమాన్యం చెల్లించేలా కృషి చేస్తామని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, తెలంగాణ కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి. జనక్ ప్రసాద్ తెలిపారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ, సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను ఐఎన్టీయూసీ నెరవేర్చుతుందని, రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి కార్మికులకు రావాల్సిన లాభాల వాటా 35 శాతం అక్టోబర్ నెలలో ఇచ్చేలా తమ వంతు ప్రయత్నం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న కోటి 20 లక్షల మంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపుకు ప్రయత్నం చేస్తున్నామని, ఇతర రాష్ట్రాల్లో ఉన్న కాంట్రాక్టు కార్మికుల వేతనాలు, కార్మికుల జీవన విధానం పరిశీలించి దానికి అనుగుణంగా పెంపు ఉంటుందని తెలిపారు. గత రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికుల వేతనాలు, కార్మికులను పట్టించుకోలేదని అన్నారు. పెర్క్స్ పై ఐటీ చెల్లింపు, కార్మికుల స్వంత ఇంటి పథకం, సి.పి.ఆర్.ఎం.ఎస్ పథకంలో మార్పులకు కృషి చేస్తామన్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాల కోసం కేంద్ర బొగ్గు కార్యదర్శి మీనాతో మాట్లాడి కొత్త గనుల కోసం ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. శ్రీరాంపూర్ ఏరియాలో 3, 4 సంవత్సరాలలో 4 గనులు మూతపడనున్నాయని తెలిపారు. శ్రీరాంపూర్ ఏరియా భవిష్యత్తు కోసం ఐఎన్టీయూసీ భరోసాగా ఉంటుందన్నారు. వివిధ మార్గాల ద్వారా కంపెనీని కాపాడడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో  నాయకులు శంకర్ రావు, ధర్మపురి, భీం రావు, గరిగే స్వామి, తిరుపతి రెడ్డి, భీం రవి, శ్రీనివాస్, నరేందర్, మెండె వెంకటి, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment