- టిడిపి పెద్దపల్లి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి తలారి రాజు
ఆర్.కె న్యూస్, నస్పూర్: కౌశిక్ రెడ్డి హైదరాబాద్ లో శుక్రవారం చేసిన వ్యాఖ్యలు అర్థరహితమైనవని, మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని టిడిపి పెద్దపల్లి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి తలారి రాజు, నస్పూర్ పట్టణ టీడీపీ నాయకుడు గరిగంటి రాజయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. చొక్కాలు మార్చినట్టుగా పార్టీలు మారుస్తూ బీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్రాప్ లో పడి అతని డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని అనడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు నాయుడు పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిచో జరగబోయే పరిణామాలకు కౌశిక్ రెడ్డి బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించారు.