- ఘనంగా వినాయక నిమజ్జనం
- బందోబస్తు నిర్వహించిన పోలీసులు
ఆర్.కె న్యూస్, నస్పూర్: గణపతి బప్పా మోరియా, జై బోలో గణేష్ మహారాజ్ కీ జై, వినాయక ఇక సెలవు అంటూ భక్తి ప్రపత్తులతో ఆదిదేవుడు గణనాథునికి వీడ్కోలు పలికారు. తొమ్మిది రోజుల పాటు మండపాల్లో ప్రతిష్ఠించిన వినాయకులకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం నస్పూర్ పట్టణంలోని శ్రీలక్ష్మి గణేష్ మండలి వద్ద కమిటీ సభ్యులు, భక్తులు గణనాథునికి పూజలు నిర్వహించారు. భారీగా వచ్చిన భక్తులతో వినాయక మండపం పరిసరాలల్లో సందడి నెలకొంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సంప్రదాయ వస్త్రధారణ తో యువతీ, యువకులు నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకుంటూ, కేరింతలు కొడుతూ భక్తి ప్రపత్తులతో గణనాథునికి సెలవు పలికారు. నిమజ్జన ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ట్రాక్టర్ ను మామిడి తోరణాలతో ముస్తాబు చేసి విఘ్నేశ్వరుడిని నిమజ్జనానికి తరలించారు. అంత కుముందు వినాయక లడ్డును గణేష్ కమిటీ సభ్యులు వేలం పాట నిర్వహించగా, పలువురు పోటా పోటీగా వేలంలో పాల్గొని దక్కించుకున్నారు. మంచిర్యాల రూరల్ సీఐ అశోక్, సీసీసీ నస్పూర్ ఎస్‌ఐ సుగుణాకర్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బలగాలతో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జక్కినబోయిన గోపాల్, అనుమండ్ల వెంకట్ రెడ్డి, రామగిరి బాలరాజు, మండల తిరుపతి, క్యాతం రాజేష్, టేకుమట్ల అంజయ్య, గోపతి తిరుపతి, చిందం రాజు, రాయమల్లు, రెంక రవి, చందా శ్రీనివాస్, రెంక నగేష్, రమేష్, రాజశేఖర్, నరేష్, శివ మహిళలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.