ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతాయి

  • డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ
  • నస్పూర్ లో బతుకమ్మ చీరల పంపిణీ

ఆర్.కె న్యూస్, నస్పూర్: రాజకీయాలకు అతీతంగా కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురా లు కొక్కిరాల సురేఖ అన్నారు. ఆదివారం నస్పూర్ పట్టణంలో కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పండుగలా కొనసాగుతోందని, ప్రతి ఏటా బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేస్తున్నారని, బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆడబిడ్డలకు చీరలు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. మహిళలకు ప్రేమ్ సాగర్ రావు ఎల్లవేళలా అండగా ఉంటారని అన్నారు. శనివారం శ్రీరాంపూర్ లో చీరల పంపిణీ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మంచిర్యాల, హాజీపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి మండలాల్లో చీరలు పంపిణీ జరుగుతుందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష చీరలు పంపిణీ చేయడం ప్రేమ్ సాగర్ రావు లక్ష్యంగా పెట్టుకున్నారని, పదేళ్లు చీరలు పంపిణీ చేస్తామని ఇప్పటికే ప్రేమ్ సాగర్ రావు ప్రకటించినట్లు తెలిపారు. అధికారంలో లేకున్నా బతుకమ్మ, రంజాన్ తోఫా నిరాటంకంగా నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సురిమిళ్ళ వేణు, నాయకులు నూకల రమేష్, గోపతి తిరుపతి, మధు, మహేష్, కృష్ణా రావు, వెంకటేష్, యశోద, తిరుమల, రాజేశ్వరి, ప్రజా ప్రతినిధులు ,  కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment