కార్మికులను తప్పుదారి పట్టించే చర్యలు మానుకోవాలి

  • ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వి. సీతారామయ్య

ఆర్.కె న్యూస్, నస్పూర్: లాభాల వాటా పంపిణీలో కార్మికులను తప్పుదారి పట్టించే చర్యలను కొన్ని కార్మిక సంఘాలు మానుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వి. సీతారామయ్య అన్నారు. గురువారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ, ప్రతి ఏడాది సంస్థకు వచ్చిన లాభాల నుంచి కొంత మొత్తం సంస్థ విస్తరణ, పెట్టుబడుల కోసం మినహాయించి, మిగిలిన మొత్తం నుంచి కార్మికులకు వాటా చెల్లించడం జరుగుతుందన్నారు. 2009-10 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు సంస్థకు వచ్చిన లాభాలు, సంస్థ విస్తరణ కోసం కేటాయించిన రూపాయలు, కార్మికులకు పంపిణీ చేసిన డబ్బుల వివరాలు వెల్లడించారు. కార్మికులు వాస్తవాలను అర్థం చేసుకోవాలని కోరారు. తాము చెప్పిన విషయాలు అవాస్తవం అయితే ఏ చర్చకైనా సిద్ధమని అన్నారు. కొన్ని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు ఉద్దేశ్యపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. సింగరేణిలో రాజకీయ జోక్యంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచి ఉందన్నారు. సింగరేణికి రావలసిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. సింగరేణిలో నిజాయితీపరులైన అధికారులను వేధింపులకు గురి చేస్తున్నారని, అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా, డిప్యూటీ జనరల్ సెక్రటరీ కె. వీరభద్రయ్య, నాయకులు గండి సతీష్, మారేపల్లి బాపు, నవీన్ రెడ్డి, అఫ్రోజ్ ఖాన్, సురేష్, సదానందం, పరశురామ్, వెంకయ్య, పాషా తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment