కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

  • మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

నేటివార్త, నస్పూర్: కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల  జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని హాజీపూర్ మండలంలో నిర్మిస్తున్న కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణ పనులను కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ జక్కుల ప్రసాద్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్య అందించడంతో పాటు క్రీడా రంగాలలో ప్రోత్సహించడం జరుగుతుందని, జాతీయ స్థాయి క్రీడా పోటీలలో పాల్గొని విద్యార్థులు తమ ప్రతిభ కనబరిచారని తెలిపారు. విద్యాలయంలో ప్రేరణ ఉత్సవ్, పుస్తకోపహార్, పర్యావరణ దినోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం తదితర అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో కేంద్రీయ విద్యాలయం కొరకు స్వంత భవనం ఉండాలనే ఉద్దేశ్యంతో దాదాపు 26 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న విద్యాలయ భవన నిర్మాణ పనులను గుత్తేదారుల సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment