- శ్రీరాంపూర్ ఏరియా జీఎం బి. సంజీవరెడ్డి
- ఆర్.కె న్యూటెక్ గని పై హోమం, అన్నదానం
ఆర్.కె న్యూస్, నస్పూర్: ప్రకృతికి విరుద్ధంగా విధులు నిర్వహించే ఉద్యోగులకు ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా వారి పై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని శ్రీరాంపూర్ ఏరియా జీఎం బి. సంజీవరెడ్డి అన్నారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-న్యూటెక్ గనిలోని మైసమ్మ ఆలయంలో మంగళవారం హోమం నిర్వహించారు. ఏరియా జీఎం బి. సంజీవరెడ్డి-రాధా కుమారి దంపతులు, గ్రూప్ ఏజెంట్ మాలోత్ రాముడు-లీలావతి దంపతులు, గని ఎస్ ఓ ఎం ఇ. స్వామి రాజు-రమాదేవి దంపతులు, రక్షణాధికారి కొట్టె రమేష్-అరుణ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం బి. సంజీవరెడ్డి మాట్లాడుతూ పని స్థలాల్లో ప్రతి ఒక్కరూ రక్షణతో కూడిన విధులు నిర్వహించాలని తెలిపారు. ఉద్యోగులందరూ సమిష్టి కృషితో గనిని ప్రథమ స్థానంలో నిలబెట్టాలని పేర్కొన్నారు. అనంతరం గని ఆవరణలో అన్నదానం ఏర్పాటు చేయగా ఉద్యోగులు, కార్మిక కుటుంబాలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ఉప ప్రధాన కార్యదర్శులు కె. వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య , ఏరియా కార్యదర్శి ఎస్కే బాజీ సైదా, కొట్టె కిషన్ రావు,హెచ్.ఎం.ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గనిని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో గుర్తింపు సంఘం పిట్ కార్యదర్శి ఆకుల లక్ష్మణ్, ఏజెంట్లు గోపాల్ సింగ్, శ్రీధర్, అధికారులు ఏవీ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రవీందర్, మురళీధర్ రావు, డాక్టర్ లోక్ నాథ్ రెడ్డి, అన్ని గనుల మేనేజర్లు, విభాగాల అధికారులు, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి ఎ.సంపత్, గజ్జి రమేష్, సందీప్ కుమార్, తిరుపతిరెడ్డి, మల్లేష్, ఆలయ కమిటీ, మైన్ కమిటీ, సేఫ్టీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.