ఆర్.కె న్యూస్, నస్పూర్: నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్.కె 6 కొత్త రోడ్ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు వెలమ రెడ్డి శివారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ కార్యదర్శి బేతి తిరుమల రావు, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చుంచు రాజ్ కిరణ్ లు ముఖ్య అతిథులుగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. గురు స్వాములు కొండ శ్రీను, బొడ్డు లక్ష్మణ్ అయ్యప్ప స్వామి పూజ నిర్వహించారు. అయ్యప్ప స్వామి భక్తులు, యువకులు రక్తదానం చేశారు. రోడ్డు ప్రమాద బాధితులకు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యాధిగ్రస్తులు, గర్భిణీ మహిళల కోసం 75 యూనిట్ల రక్తాన్ని సేకరించి, మంచిర్యాల వాలంటరీ బ్లడ్ సెంటర్ ప్రతినిధులకు అందజేసినట్లు, రక్తదానం చేయడానికి ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరు స్వచ్చందంగా ముందుకు రావాలని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి హరిప్రసాద్, ఏబిఏపి రాష్ట్ర సభ్యుడు భాస్కర్ల రాజేశం, స్థానిక అయ్యప్ప భక్తులు ఏల్పుల రవిందర్, తిరుపతి రెడ్డి, కాగితపు కుమారస్వామి, ఎలవెని రవీందర్, బామాన్ల పెళ్లి తిరుపతి, బల్లా దశరథం, పోతు మల్లయ్య, బండారు రాజేశం తదితరులు పాల్గొన్నారు.
177