ఆర్.కె న్యూస్, నస్పూర్: మంచిర్యాల జోన్ సిసిసి నస్పూర్ లోని సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాల, ఆక్స్ ఫోర్డ్ స్కూల్, మంచిర్యాల పట్టణంలోని ఆర్.బి.హెచ్.వి స్కూల్ లోని గ్రూప్-3 పరీక్ష కేంద్రాలను సోమవారం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రామగుండం సీపీ మాట్లాడుతూ కమిషనరేట్ 66 కేంద్రాల్లో గ్రూప్-3 పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష అనంతరం ఎగ్జామ్స్ షీట్స్ స్ట్రాంగ్ రూమ్ తరలింపు గురించి పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, గ్రూప్-3 ఎగ్జామ్ పోలీస్ నోడల్ అధికారి అడిషనల్ డీసీపీ (అడ్మిన్) సి. రాజు, గోదావరిఖని ఏసిపి ఎం. రమేష్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, ఏఆర్ ఏసీపీ సుందర్ రావు, రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్, గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, మంచిర్యాల రూరల్ సీఐ అశోక్, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
111