- ఎస్సార్పీ 3,3ఏ గని మేనేజర్ సిహెచ్. వెంకట్రావు
- ఉత్తమ అధికారికి ఘన సన్మానం
నస్పూర్, ఆర్.కె న్యూస్: నిర్వహిస్తున్న విధుల్లో గుర్తింపు మరింత బాధ్యత పెంచుతుందని, ఉద్యోగులు సంస్థ పట్ల అంకిత భావంతో పని చేస్తూ సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని ఎస్సార్పీ 3,3ఏ గని మేనేజర్ సిహెచ్. వెంకట్రావు అన్నారు. మంగళవారం శ్రీరాంపూర్ ఏరియా ఉత్తమ అధికారిగా ఎన్నికై గణతంత్ర దినోత్సవం రోజున సింగరేణి సీఎండీ చేతుల మీదుగా సన్మానం పొందిన సీనియర్ అండర్ మేనేజర్ కానుకుల పూర్ణచందర్ ను గని అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గని మేనేజర్ సిహెచ్ వెంకట్రావు మాట్లాడుతూ, పూర్ణచందర్ ఉత్తమ అధికారిగా ఎన్నిక కావడం సంతోషకరమని అన్నారు. నిబద్ధత, అంకిత భావంతో పని చేస్తూ, సంస్థ నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రతిభ కనబర్చడం వంటి పలు అంశాల ప్రాతిపదికన ప్రతి ఏటా ఉత్తమ అధికారులను సింగరేణి సంస్థ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సన్మానిచడం జరుగుతుందని పేర్కొన్నారు. 2024 సంవత్సరానికి గాను శ్రీరాంపూర్ ఏరియా నుంచి పూర్ణచందర్ ఉత్తమ అధికారిగా ఎన్నికయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రక్షణాధికారి మహేందర్, సంక్షేమాధికారి ఎస్. సాధన్, పిట్ ఇంజనీర్ ప్రేమ్ సాగర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.