ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా తలారి రాజు

నస్పూర్ (ఆర్.కె న్యూస్): షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా నస్పూర్ పట్టణానికి చెందిన తలారి రాజు నియమితులయ్యారు. ఈ మేరకు షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె. నర్సింగ్ నియామక పత్రం అందజేశారు. మంగళవారం తలారి రాజు అధ్యక్షతన శ్రీరాంపూర్ లో నిర్వహించిన  తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం ముఖ్య నాయకుల సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె నర్సింగ్ హాజరై మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ షెడ్యూల్డు కులాల సంక్షేమ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రభుత్వం ఎస్సీలకు ప్రత్యేక  కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని అన్నారు. నిరుద్యోగులైన షెడ్యూల్ కులాల నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఎస్సీ వర్గీకరణ వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఎన్నుకున్నారు. నియోజకవర్గ  అధ్యక్షులుగా గుమ్మడి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులుగా శీలం రంజిత్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన వారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె నర్సింగ్ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుట్ట రవి, చెవుల వాసు, తరాల విజయ్, చీమల రాజలింగు, సోగల రాములు, సొల్లు కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment