- రక్షణతో కూడిన ఉత్పత్తికి కృషి చేయాలి
- శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్
నస్పూర్, ఏప్రిల్ 01 (ఆర్ .కె న్యూస్ ): ఉద్యోగులు, అధికారుల సమిష్టి కృషితో 2025-26 ఆర్థిక సంవత్సరానికి శ్రీరాంపూర్ ఏరియా నిర్ధేశించిన 65,16,000 టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తామని శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఎం. శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ, మార్చి నెలలో ఏరియాలోని గనులు రికార్డు స్థాయిలో 147 శాతం ఉత్పత్తి సాధించాయని, మార్చి 28, 31 తేదీల్లో 10 రేకుల బొగ్గు డిస్పాచ్ చేసినట్లు, డిసెంబర్ నెలలో ఎస్సార్పీ ఓసీపీలో 176 శాతం ఉత్పత్తి సాధించినట్లు, గత ఆర్థిక సంవత్సరంలో శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె 6, ఆర్.కె న్యూ టెక్, ఎస్సార్సీ ఓసీ2 గనులు నూరు శాతానికి పైగా ఉత్పత్తి సాధించడం హర్షణీయమని పేర్కొన్నారు. మార్చి నెలలో ఆర్కే5 గని 103 శాతం, ఆర్.కె 6 గని 106 శాతం, ఆర్.కె 7 గని 102 శాతం, ఆర్.కె న్యూటెక్ గని 115 శాతం, ఎస్సార్పీ 1 గని 67 శాతం, ఎస్సార్పీ 1 గని 87, ఐకే1ఏ గని 82 శాతం ఉత్పత్తితో భూగర్భ గనులు 95 శాతం ఉత్పత్తి సాధించాయని, ఎస్సార్పీ ఓసిపి 168 శాతం, ఐకే ఓసిపి 152 శాతం ఉత్పత్తితో శ్రీరాంపూర్ ఏరియాలో 147 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించామని తెలిపారు. ఉద్యోగులు రక్షణతో కూడిన ఉత్పత్తికి కృషి చేయాలని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏరియాలోని ఆర్.కె 6, ఎస్సార్పీ 1 గనులు మూతపడనున్నట్లు తెలిపారు. ఐకె ఓసీపీలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఇప్పటి వరకు 3784 మంది అభ్యర్థులకు కారుణ్య నియామక పత్రాలు జారీ చేసినట్లు, 278 మంది గైర్హాజరు ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు ఎన్. సత్యనారాయణ, డీజీఎం (పర్సనల్) పి. అరవింద రావు, డీజీఎం (ఐఈడి) చిరంజీవులు, సీనియర్ పిఓ పి. కాంత రావు తదితరులు పాల్గొన్నారు.