- బీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఏరియా లైజన్ ఆఫీసర్ ఎన్. సత్యనారాయణ
నస్పూర్, ఆర్.కె న్యూస్: సామాజిక కార్యకర్తగా, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహాత్మ జ్యోతిరావు పూలే జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని బీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏరియా లైజన్ ఆఫీసర్ ఎన్. సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఆర్.కె 6 గని పై నిర్వహించిన మహత్మ జ్యోతిరావు పూలే 198 జయంతి వేడుకలకు గని మేనేజర్ ఈ. తిరుపతితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బి.సి సంఘం ఏరియా లైజన్ ఆఫీసర్ మాట్లాడుతూ, మహత్మ జ్యోతిరావు పూలే భావి తరాలకు సైతం మార్గదర్శకుడని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారని, స్త్రీ విద్య కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త అని, తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి మహిళల కోసం మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించారని పేర్కొన్నారు. పూలే ఆశయ సాధనకు కృషి చేయడమే మనం అర్పించే ఘన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.కె 6 గని అడిషనల్ మేనేజర్ మర్రి కొమురయ్య, గని సంక్షేమాధికారి ఎస్. సురేందర్, వెంటిలేషన్ ఆఫీసర్ ఆర్.రాం నర్సయ్య, గుర్తింపు సంఘం నాయకులు ముష్కె సమ్మయ్య, సంగం సదానందం, బీసీ సంఘం నాయకులు సైదం చిరంజీవి, కారుకూరి నగేష్, వెంగల కుమారస్వామి, బద్రి బుచ్చయ్య, బరుపటి మారుతి, గొర్ల సంతోష్, టి.సురేష్, వేముల సంతోష్, సాయి బాబా, వై. సంపత్ కుమార్, ఎస్సీ,ఎస్టీ యూనియన్ ఏరియా నాయకులు ఏల్పుల ప్రవీణ్, చిలుక రాం చందర్, ఎరోల్ల శంకర్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.