మహాత్మ జ్యోతిరావు పూలే చూపిన మార్గం ఆచరణీయం  

  • శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఎం. శ్రీనివాస్

నస్పూర్, ఆర్. కె న్యూస్: మహాత్మ జ్యోతిరావు పూలే చూపిన మార్గం ఆచరణీయమని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జనరల్ మేనేజర్ కార్యాలయ సమావేశ మందిరంలో డీజీఎం (పర్సనల్) అరవింద రావు అధ్యక్షతన నిర్వహించిన మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలకు ఏరియా జీఎం ఎం. శ్రీనివాస్ హాజరై, పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ, మహాత్మ జ్యోతిరావు పూలే సామాజిక న్యాయం, స్త్రీ పురుష సమాన హక్కుల కోసం చేసిన కృషి భారతీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని, తన భార్య సావిత్రీబాయి పూలేకు విద్య నేర్పించి, ఆమెను భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారని, 1848లో పూలే దంపతులు బాలికల కోసం తొలి పాఠశాల ప్రారంభించడం అప్పటి భారతీయ సమాజంలో సాహసోపేత చర్య అని, మహిళలు, దళితులు విద్య అభ్యసించకూడదు అనే దృక్పథాన్ని ధిక్కరించి, విద్యే విముక్తికి మార్గం అనే సంకల్పంతో పాఠశాలలు స్థాపించారని పేర్కొన్నారు. సింగరేణిలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ, ఉద్యోగుల శ్రేయస్సు కోసం చేస్తున్న ప్రయత్నాలకు పూలే ఆశయాలు ప్రేరణ అని అన్నారు. ప్రతి ఒక్కరు మహాత్మ జ్యోతిరావు పూలే చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, సమాజంలో అందరిని గౌరవించే దిశగా ముందుకెళ్లాలని, ప్రతిచర్యలో న్యాయానికి, సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిసి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏరియా లైజన్ ఆఫీసర్, ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, అధికారుల సంఘం వైస్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్, ఏరియా ఇంజనీర్ బి. చంద్రశేఖర్ రెడ్డి, డీజీఎం (సివిల్) ఆనంద్ కుమార్, బిసి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ జి. శ్రీనివాస్, బ్రాంచ్ సెక్రటరీ బరుపటి మారుతి, జీఎం కార్యాలయ వివిధ విభాగాల అధిపతులు, ఉద్యోగులు, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment