- ఆర్.కె 7 గ్రూప్ ఏజెంట్ రాజేందర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ఆర్.కె 7 గ్రూప్ ఏజెంట్ రాజేందర్ అన్నారు. శుక్రవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె 7 గని పై మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఆర్.కె 7 గ్రూప్ ఏజెంట్ రాజేందర్, గని మేనేజర్ జె. తిరుపతి లు మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్.కె 7 గ్రూప్ ఏజెంట్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక ధార్మికుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని, పూలే చేసిన సంఘ సంస్కరణలు నేటి తరానికి ఆదర్శనీయమని, యువ ఉద్యోగులు పూలేను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని అన్నారు. అనంతరం గని మేనేజర్ జె. తిరుపతి మాట్లాడుతూ, మహాత్మ జ్యోతిరావు పూలే ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఉద్యోగులకు సూచించారు. ఆర్.కె 7 గని ప్రారంభమై 50 వసంతాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో వేడుకల నిర్వహణకు కార్మిక సంఘాల నేతలు, ఉద్యోగులు తమ అభిప్రాయాలు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఏరియా వైస్ ప్రెసిడెంట్ కొట్టె కిషన్ రావు, రక్షణ అధికారి సంతోష్ రావు, ఫిట్ ఇంజనీర్ ప్రవీణ్, అండర్ మేనేజర్లు రాము, రవీందర్, సుమ, లక్ష్మి, సంక్షేమ అధికారి సంతన్, ఫిట్ సెక్రటరీ మారేపల్లి సారయ్య, బీసీ నాయకులు పేరం రమేష్, పవన్, వివిధ యూనియన్ ల నాయకులు తదితరులు పాల్గొన్నారు.