42
బెల్లంపల్లి, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో టెక్నో డాన్స్ అకాడమీ వారు గత 1999వ సంవత్సరం నుండి బెల్లంపల్లి పట్టణంలో ఎంతమంది నృత్య కళాకారులను తీర్చిదిద్ది వారిని సినీ, టీవీ రంగంలో ఉన్నత స్థాయిలో మరియు విదేశాల్లో డాన్స్ స్కూల్ నడిపించడం జరుగుతుంది. ఎందరెందరికో అద్భుతమైన డాన్స్ మాస్టర్లను అందించిన ఏకైక సంస్థ టెక్నో డాన్స్ అకాడమీ అని అన్నారు. విద్యార్థిని, విద్యార్థులు, యువతీ, యువకులను, శారీరక, మానసిక, ఉల్లాసం కోసం మరియు వారిలో సృజనాత్మక శక్తిని పోటీతత్వాన్ని పెంపొందించడం కొరకు 25వ తేదీ శుక్రవారం రోజు నుండి మే 4వ తేదీ వరకు బెల్లంపల్లి పట్టణంలోని అభ్యాస స్కూల్ బాబు క్యాంపు బస్తీలో వేసవి కాల నృత్య శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, టెక్నో డాన్స్ అకాడమీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్రాండ్ మాస్టర్ హనుమండ్ల మధుకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 31వ వార్డు కౌన్సిలర్ రాజలింగు, 32వ వార్డు కౌన్సిలర్ నీలి కృష్ణ, రేణికుంట్ల శ్రీనివాస్ అడ్మినిస్ట్రేట్యా వైస్ ప్రెసిడెంట్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, టెక్నో కొరియోగ్రాఫర్ ఆరపెల్లి సాయి కృష్ణ, డాన్స్ మాస్టర్ కోన వంశీ, విద్యార్థిని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.