పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నస్పూర్, ఆర్.కె న్యూస్:  మంచిర్యాల నగర పాలక సంస్థ పరిధిలోని చాణక్య హై స్కూల్ 1998-1999 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నస్పూర్ లో జరుపుకున్నారు. ఆదివారం నిర్వహించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన స్నేహితులందరూ 26 సంవత్సరాలకు ముందు పదో తరగతిలో విద్యను అభ్యసించిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, తమ క్షేమ సమాచారాలు పంచుకుంటూ, ఎంతో సరదాగా ఆటపాటలతో గడిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బత్తిని దేవన్న గౌడ్, ఉపాధ్యాయులు రాజేందర్, వెంకటరెడ్డి, సుధాకర్, వెంకట్ రాజం, సీతారాం, కిరణ్, సంపత్ కుమార్ సుజాత, రాజేశ్వరి, లింగమూర్తి, గంగారాం, పూర్వ విద్యార్థులు శ్రీనివాస్, రాకేష్, వేణు, మధు, శ్రీనివాస్, కరుణాకర్ రాజు, రాజి రెడ్డి, సుధాకర్, కిషన్, శివకుమార్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
AD 01

Follow Me

images (40)

Leave a Comment