- ఏప్రిల్ నెలలో 92 శాతం ఉత్పత్తి సాధించిన శ్రీరాంపూర్ ఏరియా
- శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్
నస్పూర్, ఆర్. కె న్యూస్: సింగరేణి యాజమాన్యం ఉద్యోగుల రక్షణ, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. బుధవారం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏప్రిల్ నెల ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. ఆర్.కె గని 90 శాతం, ఆర్.కె 6 గని 102 శాతం, ఆర్.కె 7 గని 74 శాతం, ఆర్.కె న్యూ టెక్ గని 105 శాతం, ఎస్సార్పీ 1 గని 78 శాతం, ఎస్సార్పీ 3,3ఏ గని 77, ఐకే1ఏ గని 76 శాతం ఉత్పత్తితో భూగర్భ గనులు 84 శాతం ఉత్పత్తి సాధించాయని, ఎస్సార్పీ ఓసిపి 126 శాతం, ఐకే ఓసిపి 28 శాతం ఉత్పత్తితో శ్రీరాంపూర్ ఏరియాలో 92 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించామని తెలిపారు. ఐకే ఓసిపిలో ఓబీ కాంట్రాక్టు కార్మికుల సమ్మె కారణంగా ఉత్పత్తికి ఆటంకం కలిగిందని, ఉద్యోగులు, అధికారులు, కార్మిక సంఘాల నాయకుల సమిష్టి కృషితో మే నెల నిర్ధేశిత ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు. ఏప్రిల్ నెలలో 19 డిపెండెంట్లకు కారుణ్య నియామక పత్రాలు అందజేశామని, నీటి బిందువు – జల సింధువు కార్యక్రమంలో భాగంగా శ్రీరాంపూర్ ఏరియాలో 5 నూతన నీటి కుంటల నిర్మాణంతో 2 పాత చెరువులను పునరుద్ధరణ చేయనున్నట్లు, ప్రాణహిత స్టేడియంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని, సింగరేణి అధ్వర్యంలో పాలిసెట్, స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ తరగతులు, వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్) పి. అరవింద రావు, ఎస్ఈ (ఐఈడి) కిరణ్ కుమార్, సీనియర్ పిఓ పి. కాంత రావు తదితరులు పాల్గొన్నారు.