ఘనంగా ఏఐవైఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నస్పూర్, ఆర్.కె న్యూస్: అఖిల భారత యువజన సమాఖ్య 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నస్పూర్ మండల సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.  శనివారం ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి లింగం రవి శ్రీరాంపూర్ కటిక దుకాణాల దగ్గర జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి లింగం రవి మాట్లాడుతూ, 1956 మే 3న భగత్ సింగ్ ఆశయ సాధన కోసం అఖిల భారత యువజన సమాఖ్య ఆవిర్భవించిందని, ఎన్నికల హామీ మేరకు బీజేపీ ప్రభుత్వం ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పించాలని, భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ ఆక్ట్ అమలు చేయాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని, జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి మహేష్,  మండల నాయకులు ఎస్.కె  అక్బర్, తిరుపతి, శ్రీనివాస్, రాజేష్, సిపిఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment