161
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిగా యం. కృష్ణమూర్తి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా కలెక్టర్, జిల్లా అదనపు కలెక్టర్ లను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ప్రస్తుతం ఓ.డి.పై జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పని చేస్తుండగా పూర్తి అదనపు బాధ్యతలతో ఇక్కడకు వచ్చారు.





