షీ టీం, భరోసా పై విద్యార్థులకు అవగాహన సదస్సు

నస్పూర్,  ఆర్.కె న్యూస్: నస్పూర్ మండలంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ లోని విద్యార్థులకు బుధవారం షీ టీం, భరోసా పై షీ టీం సభ్యులు విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం ఎస్ఐ ఉషారాణి మాట్లాడుతూ, ఆకతాయిల ఆట కట్టించి మహిళలకు రక్షణ కల్పించడం షి టీం కర్తవ్యమని, మహిళలు ఏదైనా సమస్య వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు పై తక్షణమే షీ టీం పోలీసులు స్పందించి సంబంధిత విభాగాలకు సమాచారం అందజేయడం ద్వారా ఫిర్యాదు చేసిన మహిళకు సహాయం అందుతుందని తెలిపారు. వేధింపులకు గురవుతున్న మహిళలు 6303923700 నెంబర్ లో సంప్రదించాలని, అత్యవసర సమయంలో డయల్ 100 లో సంప్రదించాలని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పేర్కొన్నారు. భరోసా సెంటర్ లీగల్ అడ్వైజర్ మాట్లాడుతూ, విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని అన్నారు. సబ్ ఆర్డినేటర్ మాట్లాడుతూ, భరోసా సెంటర్ పని తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో షీ టీం సభ్యులు శ్రవణ్, జ్యోతి, భరోసా సెంటర్ సభ్యులు, పాఠశాల సోషల్ ఆఫీసర్ మౌనిక, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment