వినూత్న రీతిలో రక్షాబంధన్ వేడుకలు

  • పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న సింగరేణి ఉద్యోగి రాజ్ కుమార్
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ పట్టణంలో ఓ సింగరేణి ఉద్యోగి తన  సోదరీమణులతో వినూత్న రీతిలో కలిసి రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నాడు. రక్షాబంధన్  సోదర, సోదరీమణుల మధ్య అనుబంధానికి ప్రతిరూపం. మహిళలు తమ అన్నదమ్ములకు రాఖీ కట్టి, వారు తమకు కలకాలం రక్షణగా ఉండాలని కోరుకుంటారు. శనివారం శ్రీరాంపూర్ లో ప్రకృతి ప్రేమికుడు, ఆర్.కె 7 గని సింగరేణి ఉద్యోగి జాడి రాజ్ కుమార్ తన సోదరీమణుల మల్లేశ్వరి, మమతలతో కలిసి ఇంటి ఆవరణలో చెట్టు నాటి, చెట్టుకు రాఖీ కట్టి వృక్షా బంధన్ నిర్వహించాడు. చెట్టుకు రాఖీ కట్టి  పర్యావరణం పట్ల తనకు ఉన్న మక్కువను చాటుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ, భూవాతావరణంలో అనేక పర్యావరణ మార్పులు సంభవించి గాలి, నీరు, నేల విపరీతంగా కలుషితమవడంతో పాటు అడవులను నరికి వేయడం వలన ప్రకృతి వైపరీత్యాలతో పాటు ఇతర జీవ జాతులు నశించిపోయే పరిస్థితి ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ, తమ సన్నిహితుల పుట్టిన రోజు, పెళ్లి రోజు, పండుగ రోజుల్లో మొక్కలు నాటి, సంరక్షించే బాధ్యత తీసుకొని పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలన్నారు.
AD 01

Follow Me

images (40)

Leave a Comment